శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి

Published Sat, Oct 19 2024 1:06 AM | Last Updated on Sat, Oct 19 2024 1:06 AM

శ్రీ

భువనేశ్వర్‌: పూరీ శ్రీ మందిరంలో సీనియర్‌ సూపరువైజర్‌పై శుక్రవారం దాడి జరిగింది. నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరబింద కుమార్‌ పాఢి తెలిపారు. శ్రీ మందిరంలో సీనియర్‌ సూపరువైజర్‌, సేవాయత్‌పై అనధికారిక వ్యక్తి దాడి చేసినట్లు ఆరోపణ. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో సేవాయత్‌, సూపరువైజర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఆనంద బజారు ప్రాంగణంలో రబిడి విక్రయం కోసం ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వాగ్యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుందని ప్రత్యక్ష సాక్షుల కథనం.

ముగిసిన నందెన్న ఉత్సవాలు

రాయగడ: స్థానిక జగన్నాథ మందిరం సమీపంలో కండ్రవీధిలో పదకొండు రోజులుగా నిర్వహిస్తున్న నందెన్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. అనంతరం జంఝా వతి నదిలో నిమజ్జనం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

కుమార్తెను చంపిన తండ్రి అరెస్టు

మల్కన్‌గిరి : చిత్రకొండ సమితి ఆర్‌ఎస్‌సీ 14 గ్రామంలో కన్న కూతుర్ని చంపి పరారైన సంజీవ్‌ భత్రను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రెండో భార్య మాటలు విని ఐదేళ్ల కుమార్తెను సంజీవ్‌ బుధవారం హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు గుంటబేడ పంచాయతీ గౌడిగూఢ అటవీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పారిపోతుండగా చిత్రకొండ ఐఐసీ ముకుందో మేల్క పట్టుకున్నారు. అనంతరం పోలీసుస్టేషన్‌కు తరలించారు.

అధ్యాపకునిగా డొంగొరియా కొంధొ అభ్యర్థి ఉత్తీర్ణత

ముఖ్యమంత్రి అభినందనలు

భువనేశ్వర్‌: ఆదిమ దళి త డొంగొరియా కొంధొ జాతి అభ్యర్థి అజయ్‌ కుమార్‌ కద్రకా యూజీసీ–ఎన్‌ఈటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫె సరు ఉద్యోగానికి అర్హత సాధించడం విశేషం. ఈ ఉత్తీర్ణతపై ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. కంధమల్‌ జిల్లా ఖంబేషి గ్రామానికి చెందిన అజయ్‌ కుమార్‌ కద్రకా కోటగడ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత సాధించి తదుపరి ఉన్నత విద్యాభ్యాసం స్థానిక కిస్‌ కళాశాలలో కొనసాగించాడు.

జయపురం మున్సిపాలిటీ

అదనపు కార్యనిర్వాహక

అధికారిగా కతిబాస సాహు

జయపురం: జయపురం మున్సిపాలిటీ నూతన అదనపు కార్యనిర్వాహ క అధికారిగా కతిబాస సాహు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. తన జాయినింగ్‌ రిపోర్టును కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయిక్‌కు అందజేశారు. సాహుకు సిద్దార్ధ పట్నాయిక్‌, చైర్మన్‌ నరేంద్ర కుమార్‌ మహంతి మున్సిపాలిటీ సిబ్బంది స్వాగతం పలికారు. ఆయన 2021లో ఒడిశా మున్సిపాలిటీ అడ్మిని స్ట్రేషన్‌ సర్వీసు పాసయ్యారు. శిక్షణ పొందిన అనంతరం జయపురం మున్సిపాలిటీలో అదనపు కార్యనిర్వాహక అధికారిగా చేరారు.

నాటుసారా స్వాధీనం

మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి మెండుఖులి గ్రామ సమీప అడవిలో నాటుసారా తయారు చేస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో మత్తిలి ఎకై ్సజ్‌ అధికారి హేమంత్‌ కుమార్‌ బాగ్‌ తన సిబ్బందితో శుక్రవారం దా డి చేశారు. దీనిలో భాగంగా 260 లీటర్ల ఊట, 1,800 కేజీల సారా ప్యాకెట్లను స్వాధీనం చేసు కున్నారు. పోలీసుల రాకను గమనించిన సారా తయారు చేస్తున్న వ్యక్తులు పరారయ్యారు.

అభ్యంతరాల స్వీకరణ

శ్రీకాకుళం: జిల్లా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో ఒప్పంద(కాంట్రాక్టు), పొరుగుసేవలు(ఔట్‌ సోర్సింగ్‌) పోస్టుల కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచామని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయంలో తెలియజేయవచ్చని డీఈఓ శుక్రవారం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి 
1
1/3

శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి

శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి 
2
2/3

శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి

శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి 
3
3/3

శ్రీ మందిరం సూపర్‌వైజర్‌పై దాడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement