రణస్థలంలో ప్రొటోకాల్‌ రగడ | - | Sakshi
Sakshi News home page

రణస్థలంలో ప్రొటోకాల్‌ రగడ

Published Sat, Oct 19 2024 1:06 AM | Last Updated on Sat, Oct 19 2024 1:06 AM

రణస్థలంలో ప్రొటోకాల్‌ రగడ

రణస్థలం: మండల సాధారణ సర్వసభ్య సమావే శం రసాభాసగా మారింది. ప్రొటోకాల్‌పై ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో దూషణలకు పాల్పడటంతో గందరగోళం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. రణస్థలం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీ పీ పిన్నింటి రజని అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోరం ఇంకా రానందున పాత ఎంపీడీవో ఆర్‌.వి.రమణమూర్తిని సన్మానించేందుకు సిద్ధమయ్యా రు. ఈ తరుణంలో రణస్థలం టీడీపీ సర్పంచ్‌ లేచి ప్రొటోకాల్‌ ఎవరూ పాటించడం లేదని, సమావేశానికి ఆహ్వానం అందించలేదని విమర్శించారు. దీనిపై రణస్థలం ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి రమేష్‌ మాట్లాడుతూ సన్మాన సమావేశానికి ప్రొటోకాల్‌ అవసరం లేదని చెప్పగా.. సర్పంచ్‌ పిన్నింటి భాను మాట్లాడుతూ ప్రోటోకాల్‌ లేని వ్యక్తులు సమావేశా నికి వచ్చి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒకరినొకరు నువ్వెంత అంటే నువ్వేంత అనుకుంటూ సమావేశాన్ని రసాభాసగా మార్చారు. విషయం తెలుసుకున్న జె.ఆర్‌.పురం ఎస్సై చిరంజీవి, సిబ్బంది ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఎంపీడీవో ఈశ్వరరావు చొరవ తీసుకుని.. కోరం లేదని సన్మాన కార్యక్రమం పెట్టామని, అందరికి ఒకేలా ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. మండల ప్రత్యేక ఆహ్వానితుడు పిన్నింటి సాయికుమార్‌ మాట్లాడుతూ సమావేశానికి వచ్చి వ్యక్తులు మర్యాద పాటించాలని, అందరూ ఒకటేనని, గత సమావేశంలో ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ వచ్చినప్పుడు ఎంతోమంది ప్రొటోకాల్‌ లేని బయట వ్యక్తులు వచ్చారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు గౌరవం నిలబెట్టుకోవాలని సూచించారు. అనంతరం పలు శాఖల అధికారులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులపై మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement