ఆలిండియా బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ బాక్సింగ్ పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల విశాఖలోని ఆంధ్రయూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన అంతర్ కళాశాలల చాంపియన్ షిప్‌లో ఉత్తమప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు పతకాలు దక్కించుకోవడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారుల్లో ఎస్.తేజేశ్వర్ 48 కిలోల విభాగంలో బంగారుపతకం, ఎ.సాయి 51 కిలోల విభాగంలో బంగారు పతకం, జి.లిఖిత్‌రెడ్డి 92 కేజీల విభాగంలో బంగారు పతకం, ఎస్.కె.సుల్తానా కాంస్య పతకం దక్కించుకున్నారు. ఆ నలుగురు క్రీడాకారులు డిసెంబర్ 26 నుంచి జనవరి2వ తేదీవరకు పంజాబ్‌లో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ పోటీలకు ఆంధ్రా యూనివర్సీటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. యూనివర్సిటీ స్థాయిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోలా మన్మథకుమార్, శాప్ కోచ్ బి.ఈశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు ఎస్.ఈ.రాజు, పీఎల్.ప్రసాద్, రింగ్ ఆఫీషియల్స్ వి.సంతోష్‌కుమార్, పి.శ్రీనివాసరావు, బి.జగదీష్‌నాయుడు తదితరులు అభినందించారు.
వచ్చే నెల 26నుంచి పంజాబ్‌లో పోటీలు
Comments
Please login to add a commentAdd a comment