డీజీఎం సుబాష్ పండా అరెస్టు
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ పోలీసులు ఒడిశా పోలీసు హౌసింగ్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండాని మంగళవారం అరెస్టు చేశారు. అక్రమ ఆస్తుల ఆర్జన ఆరోపణ ఆధారంగా సోమవారం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 2 బహుళ అంతస్తు భవనాలు, 1 ఫ్లాటు, 870 గ్రామలు బంగారం, 5 ఇళ్ల స్థలాలు, నగదు రూ. 13 లక్షల 50 వేలు, పొదుపు, పెట్టుబడుల్లో రూ. 1 కోటి 80 లక్షలు ఉన్నట్లు గర్తించారు. వీటి సమగ్ర విలువ ఆదాయం కంటే 303 శాతం అధికంగా లెక్క తేలింది.
తల లేని మృతదేహంలో కేసులో ఆరుగురు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 57 గ్రామంలో నదిలో బస్తాలో కట్టి పడేసిన మృతదేహాన్ని గత గురువారం కలిమెల పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహానికి తల లేదు. దర్యాప్తులో మృతుడు సుర్లుకొండ గ్రామానికి చెందిన పదియా మడ్కమి (47)గా తెలిసింది. ఇతను చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులు పొలంలో నిద్రపోతున్న సమయంలో తల నరికేసి తలలో పడేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితులైన సోడి పోడియామి, రామ పోడియామి, మున్న పోడియామి, ఇర్మా పోడియామి, పధలం పోడియామి, రామ కావసీలను మంగళవారం సుర్లుకొండ గ్రామంలో అరెస్టు చేసి కలిమెల పోలీస్‌స్టేషన్‌కు తెచ్చారు. ఈనెల 8న హత్య చేసినట్లు నిందితులు తెలిపారు.
రెండు బైక్‌లు ఢీ: నలుగురికి గాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసు స్టేషన్ పరిధిలో గల ఎంవీ 126 గ్రామం వద్ద ఈ రోజు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో రెండు బైక్‌లు ఢీకొని నలుగురు గాయపడ్డారు. కనిమెట్ల గ్రామానికి చెందిన గంగా పోడియామి, కార్తీక్ పోడియామిలు ఒక బైక్‌పై వస్తున్నారు. మోటు వైపు నుంచి భీమా మధిర, నీల్ మధిర అనే ఇద్దరు మరో బైక్‌పై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. స్థానికులు చూసి వీరిని అంబులెన్స్ సాయంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మల్కన్‌గిరి తరలించారు. ఐఐసీ చంద్రకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment