23 ఎకరాల్లోని గంజాయి పంట దహనం
జయపురం: బొయిపరిగుడ సమితి జి.మఝిగుడ పంచాయతీ కాట్రగుడ, బంసుయగుడ, బంశుగుడ గ్రామాల ప్రాంతాల్లో 23 ఎకరాల్లో రైతులు పండించిన గంజాయి పంటను పోలీసులు గుర్తించి దహనం చేసినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ మీడియాకు తెలిపారు. 23 ఎకరాల్లో 22,0300 గంజాయి మొక్కలను కాల్చివేసినట్లు వెల్లడించారు. జిల్లా వలంటరీ సురక్షా ఫోర్స్ సహకారంతో జరిగిన దాడుల్లో బొయిపరిగుడ పోలీసులు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, మెజిస్ట్రేట్ బాధ్యతలు నిర్వహిస్తున్న బొయిపరిగుడ అదనపు తహసీల్దార్ ఖొగేశ్వర సౌరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి మాఫియా బొయిపొరిగుడ సమితిలో స్థావరాలు ఏర్పరుచుకొని ఆదివాసీలను ప్రలోభ పరచి గంజాయి సాగు చేయిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే అలాంటి వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment