సమస్యలు పరిష్కరించండి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితిలో మంగళవారం కలెక్టర్ వి.కీర్తి వాసన్ నిర్వహించిన ప్రజాభియోగ శిబిరంలో 40 ఫిర్యాదులు అందినట్లు బొరిగుమ్మ అధికారులు వెల్లడించారు. ఈ ఫిర్యాదులలో వ్యక్తిగతమైనవి 13, కమ్యూనిటీకి చెందినవి 27 వచ్చాయన్నారు. బొరిగుమ్మ సమితి ఇంజినీర్‌పై కుచులి గ్రామం ప్రతాపహోత్త ఫిర్యాదు చేశారు. హోర్దిలి గ్రామంలో ఉన్నత పాఠశాల ప్రాంతంలో సమితి తరఫున నూతన గృహం నిర్మించామని, నిర్మాణం పూర్తయి 3 ఏళ్లు గడచినా ఇంజినీర్ గుప్త దాస్ డబ్బు చెల్లించలేదని ఫిర్యాదులో ఆరోపించారు. తెలింగిరి డ్యామ్ నీరు కొద్ది రోజుల్లో బయటకు పోయి ఖాళీ అవుతుందని, సాగునీటి సమస్య పరిష్కరించాలని పోడాపొదర్ గ్రామం చిత్ర సేన్ నేతృత్వంలో రైతులు కోరారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు అదనపు బీడీఓ మాధురీ ఆచారి, ఏఈ ప్రకాశ్ ప్రధాన్, బీఈఓ సచిన్ కుమార్ మల్లిక్, సీడీపీఓ గాయత్రీ బాహిణీపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment