25 వేల మంది సభ్యత్వమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

25 వేల మంది సభ్యత్వమే లక్ష్యం

Published Wed, Nov 20 2024 12:37 AM | Last Updated on Wed, Nov 20 2024 12:37 AM

25 వే

25 వేల మంది సభ్యత్వమే లక్ష్యం

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ విధాన సభ స్థానంలో బీజేడీలో 25 మందిని సభ్యులుగా చేర్చాలనే లక్ష్యంగా పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ చంద్ర మజ్జి పిలుపునిచ్చారు. మంగళవారం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో డొంబురు మజ్జి కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యులను చేర్చాలని సూచించారు. గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత పాలకులు పేద ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం వైఖరిని ఎత్తిచూపాలన్నారు. పార్టీ నాయకులు ప్రతిప్‌ మజ్జి, సదాశివ ప్రధాని తదితరులు ప్రసంగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
25 వేల మంది సభ్యత్వమే లక్ష్యం 1
1/1

25 వేల మంది సభ్యత్వమే లక్ష్యం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement