అటవీ శాఖ సిబ్బంది సస్పెన్షన్
భువనేశ్వర్: ఆహార అన్వేషణలో విద్యుదాఘాతానికి గురై మూడు ఏనుగులు దుర్మరణం పాలయిన ఘటనలో ముగ్గురు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు సీనియర్ అధికారులను బా ధ్యులుగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని దర్యాప్తు బృందం విభాగానికి సిఫారసు చేసింది. అలాగే వన్య ప్రాణులను చేజిక్కించుకునేందుకు విద్యుత్ తీగలు పన్నిన ముఠాకు చెందిన ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం స్థానిక పోలీసుల సహకారంతో గాలిస్తున్నారు.
హైకోర్టులో వ్యాజ్యం
విద్యుదాఘాతంతో ఏనుగుల గుంపు దుర్మరణం విచారకర ఘటనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా స్పందించింది. ఈ సంఘటనపై హైకోర్టు స్వయంగా ప్రజాహిత వ్యాజ్యం ప్రతిపాదించింది. ఈ వ్యాజ్యం విచారణకు ధర్మాసనం స్వీకరించి ప్రత్యర్థి వర్గాలకు తాఖీదులు జారీ చేసింది. వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment