వన్డే మ్యాచ్ టికెట్ ధరలు తగ్గింపు
భువనేశ్వర్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ ధరల్ని తగ్గించినట్లు రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్ మంగళ వారం ప్రకటించారు. స్థానిక కళింగ స్టేడియంలో మంత్రి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 9వ తేదీన కటక్ బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. క్రీడా విభాగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఓసీఏ అధికార వర్గాలు, రాష్ట్ర క్రీడా విభాగం అధికారులు సమావేశమై చర్చించారు. లోగడ ఒడిశా క్రికెటు అసోసియేషను నిర్ధారించిన భారత్, ఇంగ్లండు వన్డే క్రికెటు మ్యాచ్ టికెటు ధరల్ని తగ్గించాలని నిర్ణయించారు. న్యూ పెవెలియన్, కార్పొరేటు బాక్సు టికెట్లు మినహా ఇతర వర్గాల టికెటు ధరల్ని తగ్గించారు. ఈ నిర్ణయం ప్రకారం మ్యాచ్ టికెటు తాజా ధరల వివరాలిలా ఉన్నాయి.
● 1, 3వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 12 వేల నుంచి రూ. 11 వేలకు తగ్గించారు.
● 2, 4వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 1,000 నుంచి రూ. 900కి తగ్గించారు.
● 5వ నంబరు గ్యాలరీ ధరని రూ. 1,500 నుంచి రూ. 1,200కి, 7వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 800 నుంచి రూ. 700కి తగ్గించారు.
● ఎన్‌క్లోజరు టికెటు ధరని రూ. 8 వేలు నుంచి రూ. 7 వేలకి తగ్గించారు.
● ఎయిర్ కండిషన్ గ్యాలరీ బాక్సు టికెటు ధరని రూ. 9 వేల నుంచి రూ. 8 వేలకి తగ్గించారు.
● లోగడ ఒడిశా క్రికెటు అసోసియేషను నిర్ధారించిన న్యూ పెవెలియన్ టికెటు ధర రూ. 10 వేలు, కార్పొరేటు బాక్సు టికెటు ధర రూ. 20,000గా కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment