కార్చిచ్చు నివారణకు కసరత్తు
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ హాల్ నంబర్ 1లో జిల్లా స్థాయి అగ్నినివారణ సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.ఆనంద్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సబ్ కలెక్టర్ అనూప్ పండా అటవీ రేంజ్ అధికారులు, తహసీల్దార్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. శీతాకాలంలో గజపతి జిల్లాలో మొత్తం అటవీ ప్రాంతాల్లో గత ఏడాది 921 పాయింట్లలో తరచూ అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. ముఖ్యంగా మోహన, ఆర్.ఉదయగిరి, నువాగడ అటవీ ప్రాంతాల్లో 2024– 25అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు నివారించడానికి యాక్షన్ ప్లాన్ అవసరమని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల అనేక విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో కార్చిచ్చు ఆపడానికి తగు చర్యలను అధికారులు వివరించారు. అటవీ ప్రాంతాల్లో దగ్గరలోని పంచాయతీ సర్పంచులు చొరవ తీసుకుని అగ్నిప్రమాదాల నివారణకు ఉపక్రమిస్తే వారికి తగు పారితోషికం, సత్కారం అందిస్తామని డీఎఫ్‌ఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment