మళ్లీ ఎంఈఓపై విచారణ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎంఈఓపై విచారణ

Published Thu, Nov 21 2024 12:29 AM | Last Updated on Thu, Nov 21 2024 12:29 AM

మళ్లీ ఎంఈఓపై విచారణ

మళ్లీ ఎంఈఓపై విచారణ

గరుగుబిల్లి: గతంలో ఎంఈఓగా విధులు నిర్వహించిన ఎన్‌.నాగభూషణరావుపై స్థానిక ఎంఆర్‌సీలో విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.దామోదర్‌రావు, పార్వతీపురం డిప్యూటీ డీఈఓ బి.రాజ్‌కుమార్‌లు మరోసారి బుధవారం విచారణ నిర్వహించారు. ఎంఈఓ నాగభూషణ్‌ రావు పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్‌కు గురైన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా విచారణాధికారులకు పార్వతీపురం యుటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రమేష్‌, కె.భాస్కరరావు, యుటీఎఫ్‌ మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావులు గతంలో ఎంఈఓ చేసిన అక్రమాలు, అవినీతి, సర్వీస్‌ తప్పిదాలపై ఆధారాలను సమర్పించారు. అనంతరం ఎ.డి దామోదర్‌రావు మాట్లాడుతూ గతంలో గరుగుబిల్లి, జియ్యమ్మవలస ఎంఈఓగా పనిచేసిన నాగభూషణరావుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆదేశాలమేరకు విచారణ చేపట్టామన్నారు. విచారణలో సేకరించిన అంశాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి తదుపరి చర్యల నిమిత్తం ఆర్‌జేడీకి సమర్పించనున్నామన్నారు. ఈ విచారణలో స్థానిక ఎంఈఓ డి.అప్పలనాయుడు, ఎంఈఓ–2 కె.కొండలరావు, జియ్యమ్మవలస ఎంఈఓ–2 ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement