పార్వతీపురంటౌన్: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ నగేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేత్ర పరీక్షలు, వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందుల పంపిణీ, దృష్టి దోషం ఉన్న వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించి కంటి చూపు కాపాడాల్సిన బాధ్యత జిల్లా అంధత్వ నివారణ సంస్థ చేపడుతుందని చెప్పారు. నేత్ర సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్ర చికిత్సల కోసం పుష్పగిరి కంటి ఆస్పత్రి, జెమ్స్ ఆస్పత్రి, పాలకొండ, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి నిర్వహిస్తామన్నారు. వారందరికీ ఉచిత రవాణా, వసతి, భోజనం, కళ్ల జొళ్లు, మందుల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేత్ర వైద్య అధికారులు, కంటి వైద్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment