యంత్రాలతో వ్యవసాయం లాభదాయకం
స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. పంటల కోసేందుకు దేశీయ పద్ధతిలో ఎకరాకు పది నుంచి పన్నెండు మంది మనుషులను వినియోగించటం జరుగుతుందని, అందువలన అధిక ఖర్చు, సమయం వెచ్చించాల్సి వస్తుందన్నారు. ఒక యంత్రం ఒక గంటలో 3, 4 క్వింటాళ్లు పుష్టికర ఆహార వ్యవసాయ పంటల కోత కోసి పరిశుభ్ర పరుస్తుందన్నారు. పాత పద్ధతిలో చేతులతో పంటలు కోసి నూర్పుడి చేస్తే గంటకు కేవలం 2, 3 కేజీలు మాత్రం చేయగలరన్నారు. ఇటీవల ఒడిశా వ్యవసాయ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం వారు గంటలో చోళ్లు పంట కోత కోసి 80 కేజీలు పరిశుభ్రపరచారని ఉదహరించారు. రాష్ట్రంలో అధికంగా చోళ్లు, ఇతర పౌష్టికాహార పంటలు పండించేందకు అధునూతన యంత్రాలు అవసరమన్నారు. ఒడిశాలో మెట్ట ప్రాంతాలలో పౌష్టికాహార పంటలు, పథకం ప్రయోగాత్మకంగా కొరాపుట్, నవరంగపూర్, నువాపడ, ఖెంజూర్, సుందరఘడ్ జిల్లాల్లో పరిశోధనలు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యంత్ర వినియోగ కోఆర్డినేటర్ సంగ్రామ కేశర స్వై, వ్యవసాయ వైజ్ఞానికులు డాక్టర్ ప్రసాద్ కముడి, ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ కేంద్రం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ, శ్రీఅన్న అభిజాన్ యోజన అధికారి తాపస రంజన్ రాయ్, పలువురు వ్యవసాయ విబాగ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
జయపురం: వ్యవసాయంలో యంత్రాలను వినియోగిస్తే రైతులకు లాభదాయకమని కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్ అన్నారు. ఎం.ఎస్.స్వామినాథ్న్ రిసెర్చ్ ఫౌండేషన్ జయపురం, ఒడిశా వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం, ఇక్రిసాట్ సంస్థల సంయుక్తంగా కొరాపుట్ జిల్లా మచ్చర గ్రామంలో బుధవారం పంటలు కోసే యంత్రాలను క్షేత్ర ప్రదర్శన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మిలెట్ మిషన్ ద్వారా (నేడు శ్రీఅన్నఅభిజాన్ యోజన) గత 5 ఏళ్ల కాలంలో చేపట్టిన పౌష్టికాహార వ్యవసాయం ప్రపంచ దేశాలను అమితంగా ఆకట్టుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 100 వ్యవసాయ ఉత్పాతన సంఘాల ద్వారా పుష్టికర వ్యవసాయం కోసం యంత్రాల అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరగతి రైతులు చిన్న, చిన్న యంత్రాలను వినియోగిస్తున్నారన్నారు. ఎక్కువ భూమిలో పండించే పంటలను కోసేందుకు పెద్ద యంత్రాల వినియోగం అవసరమన్నారు. ఒడిశా వ్యవసాయ, విజ్ఞాన విశ్వవిద్యాలయం ద్వారా పరిశోధనలు చేసి విత్తనాలు నాటే యంత్రాలు, పంటలు కోసే యంత్రాలు, పంటను పరిశుభ్రపరచే యంత్రాలు వినియోగించటం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ మహంతి మాట్లాడుతూ ముఖ్యంగా సుందరఘడ్, సంబల్పూర్ జిల్లాల్లో చిరు ధాన్యాలు, కొరాపుట్, డెంకానల్ జిల్లాల్లో చోళ్లు(మండియ) పంటలకు దుక్కులు దున్నటం, విత్తులు నాటేందుకు, పంటలు కోసేందుకు ప్రయోగాత్మకంగా యంత్రాలు వినియోగంపై పరీక్ష మూలకంగా క్షేత్ర
Comments
Please login to add a commentAdd a comment