దివ్యాంగులకు యంత్రాలు, పరికరాల పంపిణీ
జయపురం: మునిసిపాలిటీ అధికారులు శుక్రవా రం స్థానిక టౌన్ హాలు ప్రాంగణంలో భీమబొయి దివ్యాంగ సహాయ శిభిరం, వయోవృద్ధుల సహాయక మేళా 2024–25ను నిర్వహించారు. వేలాది మంది దివ్యాంగులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. ఈ మేళాలో దివ్యాంగులకు 21 రకాల పరీక్షలు చేపట్టి వారికి ధ్రువపత్రాలు, హియరింగ్ యంత్రాలు, ట్రై సైకిళ్లు, కృత్రిమ అవయవాలు, బస్సు, రైలులలో ప్రాయాణానికి పాస్‌లు సమకూర్చారు. డాక్టర్ల బృందం దివ్యాంగులను పరీక్షించి వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఆధార్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలను ఉచితంగా జిరాక్స్ తీసేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. రెసిడెన్స్, కుల ధ్రువపత్రాలు సమకూర్చేందుకు రెవెన్యూ విభాగం కౌంటర్ ఏర్పాటు చేసింది. వయోవృద్షుధలకు అవసరమైన సహాయ ధ్రవపత్రాలతోపాటు బస్సు, రైల్ పాస్‌లు సమకూర్చారు. స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, మున్పిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్‌పర్సన్ బి.సునీత తదితరులు దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందజేశారు. ఈ మేళాలో 562 మంది దివ్యాంగులను గుర్తించి జాబితాలో నమోదు చేసినట్లు మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కృతిబాస రౌత్ వెల్లడించారు. నిస్సహాయులైన ముగ్గురు దావ్యాంగులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. 57 మంది దివ్యాంగులు, వృద్ధులకు సామాజిక సురక్ష పథకంలో పెన్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. ఏడుగురు దివ్యాంగులకు వీల్ చైర్లు, నలుగురుకి ట్రై సైకిళ్లు, 217 మందికి బస్ పాస్‌లు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment