ధాన్యం మండీలు ప్రారంభించాలి
జయపురం: వరి కోతలు, నూర్పుడిలు పూర్తి కావస్తున్నందన వెంటనే మండీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు కృషక కళ్యాణ మంచ్ డిమాండ్ చేసింది. శనివారం కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్ర కుమార్ ప్రధాన్ నేతృత్వంలో ప్రతినిధులు జయపురం సబ్ కలెక్టర్ ఎ.శొశ్యరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంట కోతలు, నూర్పుడిలు పూర్తయ్యాయని వెల్లడించారు. ముఖ్యంగా సాగునీటి సైకర్యం లేని, ఎత్తుపోతల పథకాల భూములలో 80 నుంచి 90 శాతం నూర్పుడిలు పూర్తయ్యాయని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు మండీలు ఏర్పాటు చేయకపోవటం వలన, ధాన్యం నిల్వ ఉంచేందుకు సైకర్యాలు లేని రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల డిసంబర్ 1, 2వ తేదీల్లో మండీలు తెరవాలని డిమాండ్ చేశారు. ఇంజినీర్ల తప్పు కారణంగా తెలంగిరి జలాశయంలో నీరు విడిచిపెట్టారని, అందువలన రబీ పంటకు సాగునీరు లభించదన్నారు. యుద్ధప్రాతిపదిన డ్యామ్ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. రబి పంటలకు సాగునీరు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండీలలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యం కన్నా అధిక ధాన్యం ఉత్పత్తి అయిందని, అందువల్ల రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోతే తక్కువ ధరకు అమ్ముకోవలసిన పరిస్థితి నెలకొంటుందనే భయం వ్యక్తం చేశారు. సాగునీటి వనరుల గల భూములలో ఎకరాకు 25 కేజీల ధాన్యం కొంటారని, అలా కాకుండా పండిన ధాన్యం అంతా కోనుగోలు చేయాలని కోరారు. మండీలలో దళారులు లేకుండా చేయాలని, మండీలు ప్రారంభించే ముందు ఖాళీ సంచులను రైతులకు రిటన్ చేయాలని, మండీలకు రైతులు తెచ్చిన ధాన్యం అంతా అదే రోజున కొనుగోలు చేయాలన్నారు. సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన వారిలో రవీంద్రప్రధాన్, విజయ్ పండా, త్రినాథ్ బిశాయి, సింహాచల మల్లిక్, విశ్వనాథ్ గౌడ, ప్రదీప్ ప్రదాన్, గంగాధర షొడంగి, తిల్ నాయక్, ఖొగేశవర సాహు, రాజేంద్ర మఝి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment