బీజేడీకి సమితి సభ్యుల రాజీనామా
పర్లాకిమిడి: జిల్లాలోని గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండల్‌పై సమితి సభ్యులు ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో గుమ్మా సమితి సభ్యులు 14 మంది బీజేడీ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను పార్టీ అధ్యక్షుడికి పంపుతున్నామని పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. బీజేడీకి రాజీనామా చేసినవారిలో బెర్ని గొమాంగో, అథినియల్ నైకా, గీతాంజలి కండువాలో, యస్ని రయితో, దమన్ గొమాంగో, రియాబో భుయ్యాన్, మైస్రక్ రైయితో, అనితా భుయ్యాన్, కె.సరస్వతి, జలితా మండల్, భాస్కర్ భుయ్యాన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment