రాజ్యాంగ ప్రచార రథానికి ఘన స్వాగతం
జయపురం: రాజ్యాంగంపై ప్రజలను చైత్యన్య పరచేందుకు ఒడిశా రాష్ట్రంలో సంచారం చేస్తున్న రాజ్యాంగ సచేతన ప్రచార రథం శుక్రవారం రాత్రి జయపురం చేరింది. రథానికి కొరాపుట్ జిల్లా మూల ఆదివాసీ మహాసంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. జయపురం 26వ జాతీయ రహదారిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రచార రథానికి స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మూల ఆదివాసీ మహాసంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రబీర్ పాత్రో మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ దేశ ప్రజల కోసం రచించిన రాజ్యాంగంపై అనేక మంది ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ ప్రజలకు అంతగా అవగాహన లేదని, అందువల్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు రాజ్యాంగ సచేతన ప్రచార రథం కొరాపుట్ జిల్లాలోని పలు సమితులలో పర్యటించిందని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ నాటికి భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తవుతాయని, ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం దేశమంతా నిర్వహిస్తారని వెల్లడించారు. రాజ్యాంగ 75వ వార్షికోత్సవాలు కొరాపుట్ జిల్లా జయపురంలో జరుపనున్నట్టు తెలిపారు. రాష్ట్ర మూల ఆదివాసీ మహాసంఘం మహిళా విభాగ అధ్యక్షురాలు మనశ్వినీ టక్రి, హిమాంశు భొత్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment