చలో ఢిల్లీ విజయవంతం చేయండి
పర్లాకిమిడి: అఖిల భారత విద్యార్థి పరిషత్ పర్లాకిమిడి పట్టణ సమావేశం స్థానిక రాజవీధిలో శ్రీశైలం ఫంక్షన్ హాల్‌లో శనివారం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బినోదినీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ పట్నాయక్ విచ్చేసి ప్రారంభించారు. గౌరవ అతిథులుగా సంజయ్ జెన్నా, మహిళా కళాశాల అధ్యాపకురాలు భారతీ పాణిగ్రాహి, జాతీయ క్రీడాకారుడు కిశోర్ చంద్ర రథ్, రాయగడ ఏ.బి.వి.పి ప్రముఖులు శేషసాయి సేనాపతి, సరస్వతీ శిశు విద్యామందిర్ ప్రధాన అచార్యులు సరోజ్‌పండా తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు గడిచినా ఉన్నత చదువులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదన్నారు. విద్యార్థులు అంతా ఏకమై ఈ నెల 27 నుంచి 29 వరకు ఢిల్లీలో జరుగనున్న దశమ సర్వభారతీయ విద్యార్థి సమ్మేళనానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఏ.బి.వి.పి జిల్లా కార్యదర్శి శుభప్రసాద్ శర్మ, కోఆర్డినేటర్ ముఖలింగ్ పడిక, అధ్యక్షుడు ఉమాచరణ్ దాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment