భువనేశ్వర్:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన రోజునే పింఛన్ ప్రదానం చేయాలని ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా లేఖ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విభాగాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్య నిర్వాహక కార్యదర్శులు, కమిషనర్లకు ఈ లేఖ జారీ చేశారు. ప్రతి నెల విరామం పొందిన సిబ్బందికి అదే రోజున పింఛన్ మంజూరు చేసిన అభ్యర్థుల వివరాల్ని క్రమం తప్పకుండా ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి దాఖలు చేయాలని సూచించారు. డిసెంబర్ 7వ తేదీ లోగా ఈ జాబితా దాఖలు చేయాలని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో దీర్ఘ కాలం సిబ్బందిగా ప్రభుత్వ సేవలు అందించిన వారికి విరామం అనంతరం సుఖమయమైన జీవనం కొనసాగించేందుకు సకాలంలో పింఛన్ మంజూరు ఎంతగానో దోహదపడుతుంది. ఉద్యోగ కాలంలో విజిలెన్సు, క్రమశిక్షణ చర్యలు ఇతరేతర పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితుల్లో రిటైరయ్యే కాలానికి ముందుగానే పరిష్కరించి సకాలంలో పింఛన్ మంజూరుకు మార్గం సుగమం చేయాలని చీఫ్ సెక్రటరీ జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు 2019 సంవత్సరం డిసెంబరు నెల 12వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన ఇంత వరకు వాస్తవ కార్యాచరణకు నోచుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment