లోకాయుక్త, రాష్ట్ర ఎన్నికల కమిషను, రాష్ట్ర మహిళా కమిషను, ఒడిశా విద్యుత్ నియంత్రణ కమిషను (ఓఈఆర్‌సి) అధ్యక్ష పదవులు దీర్ఘకాలంగా ఖాళీగా పడి ఉన్నాయి. దీంతో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త అధ్యక్ష పదవి ఆగస్టు నెల నుంచి ఖాళీ అయింది. ఈ పదవి భర్తీ కోసం గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ ఖరారు చేసినా అభ్యర్థిని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు అనుమతించకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. అవినీతి నియంత్రణలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రతిష్టాత్మక లోకాయుక్త అధ్యక్షుడు లేకపోవడంతో బాధితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డాక్టరు రాజేంద్ర ప్రసాద్ శర్మ అధ్యక్ష పదవీ కాలం పూర్తి అయిన నుంచి ఈ పదవి ఖాళీగా పడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment