సాహిత్య రంగానికి పెద్దపీట వేయాలి
జయపురం:కొరాపుట్ జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉన్నా నేటివరకు పాలకులు చిన్నచూపు వలన వెనుకబడి ఉందన్నారు. అనేక మంది సాహిత్య కారులున్నా రాష్ట్ర స్థాయి సాహిత్య సన్మానం ఒక్కరికీ లభించకపోవటం విచారకరమన్నారు. సాహిత్యరంగానికి పెద్దపీట వేయాలని జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి అన్నారు. ఆదివారం దొడ్ర గ్రామం ఆదివాసీ కుటుంబ సంస్థ జయపురం ఎస్.ఎర్.మాల్ లో నిర్వహించిన సాహిత్య హర్షితా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మన జిల్లా సాహిత్యరంగంలో అగ్రగామిగా నిలవాలంటే సాహితీవేత్తలకు, రచయితలను ప్రజలు ఆదరించి, ప్రోత్సహించాలని ప్రజలకు, సాహితీ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న సరల అవార్డు గ్రహీత డాక్టర్ సరోజినీ సాహు మాట్లాడుతూ కొరాపుట్ జిల్లా సాహిత్య రంగంలో వెనుకబడి లేదని, జయపురం మట్టిలో సత్య మిశ్ర లాంటి ప్రముఖ సాహితీవేత్త పుట్టారని ఉదహరించారు. ఆదివాసీ కుటుంబ సంస్థ అధ్యక్షుడు సయిమన్ బిడిక అధ్యక్షతన జరిగిన సాహితీ చర్చలో చరిత్రలో కొరాపుట్ విముక్త్తి సంగ్రామం, ఆదివాసీ అశ్మిత, పాఠకులు ఏం కోరుతున్నారు, కొరాపుట్ సంగీతం, చలన చిత్ర భవిష్యత్‌పై సాహితీ చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రముఖ పరిశోధకుడు శ్రీరంగ నాయక్, కవి బలరాం పూజారి, కళాకారుడు చంద్ర కాంత బిశ్వాల్ పాల్గొన్నారు. శ్యామలేషన్ గుప్త బెంగార్ రచనను ధర్మరాజ్ అనువాదం ‘బాబూలాల్’ కవితా సంకళనాన్ని అతిథులు విడుదల చేసి ప్రజలకు అంకితం చేశారు. కె.వి.విజయలక్ష్మీ పాణిగ్రహి, విమళ దాస్ పట్నాయక్, మనోరంజన్ త్రిపాఠీ, రంజన్ మహురియ, సుజాత మహాపాత్రో, ప్రొఫెసర్ అలోక్ బరాల్, అజిత్ కుమార్ భొయి, రఘునాథ్ బిశ్వాల్, పలువురు రచయితలు సాహితీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఎమ్మెల్యే బాహిణీపతి
Comments
Please login to add a commentAdd a comment