రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
భువనేశ్వర్: డిసెంబర్ 4వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి శ్రీమందిరం సందర్శించనున్నారు. శ్రీ మందిరంలో రత్న వేదిక ముంగిట ఆమె మూల విరాటులకు పూజార్చనలు చేయనున్నారు. ఈ సందర్భంగా అనుబంధ సేవాయత్ల ఆధ్వర్యంలో పూజాదులు సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఛొత్తీషా నియోగుల ప్రతినిధి ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి(సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి శ్రీమందిరం సందర్శన సందర్భంగా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఛొత్తీషా నియోగుల సంఘం ప్రతినిథులు హామీ ఇచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment