ప్రభుత్వ పాలనపై పీఎం సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాలనపై పీఎం సమీక్ష

Published Thu, Nov 28 2024 12:54 AM | Last Updated on Thu, Nov 28 2024 12:54 AM

ప్రభుత్వ పాలనపై పీఎం సమీక్ష

ప్రభుత్వ పాలనపై పీఎం సమీక్ష

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు

మన్మోహన్‌ సామల్‌

భువనేశ్వర్‌: రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనని సమీక్షిస్తారు. ఆయన రాక పురస్కరించుకుని ప్రతిపాదించిన రోడ్‌ షో కార్యక్రమం జరగదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌ బుధవారం తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా 3 రోజులపాటు నిరవధికంగా ప్రధానమంత్రి బస చేయడం ఇదే తొలిసారి కావడం విశేషంగా పేర్కొన్నారు. ఈనెల 29 సాయంత్రం 4.15 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. కాసేపు రాజ్‌ భవన్‌లో విశ్రమించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుతారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో ప్రత్యక్షంగా సమావేశం అవుతా రు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాలన బాగోగుల ను ప్రధానమంత్రి సమీక్షిస్తారు. ఈ సమావేశం పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు 2 గంటలపాటు పార్టీ కార్యాలయంలో గడుపుతారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement