దళితులపై దాడులు అధికమవుతున్నాయి
టెక్కలి: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు బోకర నారాయణరావు, సమతా సైనిక్ దళ్ జిల్లా కార్యదర్శి చల్లా రామారావు కోరారు. బుధవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి నేతృత్వంలో డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. నారాయణరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలు నిర్వహించి దళితులపై ఎలాంటి దాడులు లేకుండా శాంతియుత కమిటీలు వేయాలన్నారు. అలాగే దళితుల కోసం కేటాయించిన మానిటరీ రిలీఫ్ ఫండ్ విడుదల విషయంలో కలెక్టర్ కార్యాలయంలో గల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులపై జరుగుతున్న దాడుల్లో అట్రాసిటీ కేసులపై వేగవంతమైన విచారణ చేయాలని నారాయణరావు కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వివిధ ఉద్యోగులపై వేధింపులు లేకుండా చూడాలని విన్నవించారు. సమావేశంలో కమిటీ సభ్యులు బి.ప్రభాకర్రావు, గేదెల రమణమూర్తి, డివిజన్ పరిధిలో తహసీల్దార్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment