రాజాం సిటీ: ఈ నెల 26 వరకు తమిళనాడులో జరిగిన సౌత్‌జోన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ బుధవారం తెలిపారు. జూనియర్ విభాగంలో పి.దీపిక (76 కేజీల కేటగిరీ), వి.శరత్ (59 కేజీల కేటగిరీ)లు రజత పతకాలు సాధించారని చెప్పారు. ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అభినందించారు.
పోక్సో కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు, జరిమానా
విజయనగరం క్రైమ్: విజయనగరం మహిళా పోలీసుస్టేషన్‌లో 2022లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు, జరిమానాను పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికను అదే మండలంలోని గుంపాం గ్రామానికి చెందిన లెంక శ్రీనివాసరావు(23) కొత్తగా నిర్మిస్తున్న భవనంపైకి తీసుకువెళ్లి అత్యాచారానికి ప్రయత్నం చేసినట్లు, బాలిక తల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో 2022లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై కేటీఆర్ లక్ష్మి పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి ముద్దాయికి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్ల డించినట్లు ఎస్పీ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment