ఆసక్తిగా క్రికెట్ పోటీలు
జయపురం: స్థానిక విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్‌లో రెండో రోజు విజేతలుగా కొరాపుట్, సెమిలగుడ కాలేజీ జట్లు నిలిచాయి. మొదటి మ్యాచ్ కొరాపుట్ కళాశాల, కుంధ్ర బిజూపట్నాయిక్ డిగ్రీ కళాశాల మధ్య జరిగింది. టాస్ గెలిచిన కొరాపుట్ కళాశాల టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. ఆ టీమ్ ఆటగాళ్లు నితీష్ 101 పరుగులు, బాపి 100 పరుగులు సాధించారు. 281 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కుంధ్ర బిజూపట్నాయిక్ డిగ్రీ కళాశాల టీమ్ 18.1 ఓవర్లలో కేవలం 110 పరుగులకు ఆలౌటైంది. రెండో మ్యాచ్‌లో మల్కన్‌గిరి మోడల్ డిగ్రీ కాశాశాల, సెమిలిగుడ కళాశాల టీమ్‌లు తలపడ్డాయి. మల్కన్‌గిరి టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది. 133 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన సెమిలిగుడ కళాశాల టీమ్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి విజయం సాధించింది.
బస్సు బోల్తా
● పదిమందికి స్వల్ప గాయాలు
భువనేశ్వర్: ఖుర్దా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. అదృష్టవశాతు ఈ బస్సులో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పది మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరందర్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఖుర్దా జిల్లా బఘొమరి–బెగుణియా రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బర్‌గడ్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న చొక్కాడొళా అనే ప్రైవేటు బస్సు బోల్తా పడి రోడ్డు పక్కకు ఒరిగింది. విషయం తెలియడంతో స్థానికులు రంగంలోకి దిగి బాధితులకు చేయూతనిచ్చి ఆదుకున్నారు. గాయపడిన వారిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
కొరాపుట్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా పడిపోతున్నాయి. సోమవారం కొరాపుట్ జిల్లా దమంజోడి వద్ద భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) వద్ద 3.9 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. దీంతో సాయంత్రం 6 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
శ్రీ మందిరంలో సేవాయత్‌ల కొట్లాట
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన పూరీ శ్రీ మందిరంలో ఒకే వర్గానికి చెందిన ఇద్దరు సేవాయత్‌లు కొట్లాటకు పాల్పడ్డారు. ఈ విచారకర సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వీరివురు ముఖొ పొఖాలొ వర్గీయ సేవాయత్‌లు. వాగ్యుద్ధంతో ఆరంభమైన వివా దం కొట్లాటకు దారి తీసింది. దీంతో వృద్ధ సేవాయత్ స్వల్పంగా గాయపడ్డాడు. ఇరువుర్ని స్థానిక సింహ ద్వారం ఠాణాలో పోలీసుల సమక్షంలో హాజరు పరిచిన సందర్భంగా కూడా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం కలకలం రేపింది. కేను నమోదు చేసి సింహద్వారం ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాదకం పంపిణీ పురస్కరించుకుని వీరివురి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం .
సనాతన ధర్మం గొప్పది
పర్లాకిమిడి: మాసాంత సంక్రాంతి సందర్భంగా పట్టణంలో భజరంగ దళ్, విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో రాజావారి ప్యాలస్ నుంచి సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో సనాతన ధర్మం, హిందుత్వంపై చైతన్యం తేవడానికి ఈ నగర పరిక్రమ చేపట్టామని వీహెచ్‌పీ నాయకులు లోకనాథ మిశ్రా, కోశాధికారి హరిమోహన్ పట్నాయక్ తెలియజేశారు. అనంతరం హనుమాన్ మందిరం వద్ద చాలీసా పటించారు. ఈ ర్యాలీలో భజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షుడు మనోజ్ దాస్, తరణీ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment