ధనుర్మాస ప్రారంభ వేడుకలు
పర్లాకిమిడి:
స్థానిక కోమటి వీధి దిగువ వేంకటేశ్వర ఆలయంలో సోమవారం ఉదయం నెలగంట వేశారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన కారణంగా నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. అలాగే కేవుటి వీధిలో శ్రీప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో కూడా నెలగంట కార్యక్రమం ఉదయం ఐదు గంటలకు పూజారి ఎ.రాజగోపాలచారి ఘనంగా నిర్వహించారు. నేటి నుంచి వేంకటేశ్వర ఆలయంలో వేకువ జాము నుంచి స్వామికి ఇష్టమైన తిరుప్పావై ప్రవచనాలు భోగి పండగ వరకూ చదువుతారు. అలాగే రోజూ స్వామి వారికి ఇష్టమైన పొంగలి నైవేద్యాన్ని సమర్పిస్తామని పూజారి శ్రీనివాసా చార్యులు తెలియజేశారు.
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీకళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో సోమవారం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. సుభ్రభాత సేవలతో ప్రారంభమైన పూజా కార్యక్రమాల అనంతరం అర్చనలు, అభిషేకాలను నిర్వహించారు. మహిళలు స్వామి వారి సహస్రనామాల పఠనం చేశారు. ధనుర్మాసం విశిష్టత, ఈ మాసంలో నిర్వహించే పూజా విధానాల గురించి అర్చకులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment