● రక్తదాన శిబిరం
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురంలో ఉన్న సెంచూరియన్ వర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానానికి మించిన దానం మరొకటి లేదన్నారు. అత్యవసర సమయాల్లో మరొకరికి ప్రాణంపోసే అవకాశం వస్తుందని పేర్కొన్నారు. శిబిరంలో మొత్తం 65 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఎం రాజేంద్ర మింజ్, డిప్యూటీ కలెక్టర్, రెడ్‌క్రాస్ కార్యదర్శి కమలకాంత పండా, సెంచూరియన్ ఉపకులపతి డా.సుప్రియా పట్నాయక్, రిజిస్ట్రార్ డా.అనితాపాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) డా.దుర్గాప్రసాద్ పాఢి, డీన్ ఎస్.పి.పండా, డీన్ అడ్మిన్ డా.ఎస్.ఎన్.పండా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డా.నిహాల్, స్టూడెంట్ సంక్షేమ శాఖ డీన్ డా.రితీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment