మూడు ధాన్యం కొనుగోలు మండీలు ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి పరిధిలో మూడు ధాన్యం కొనుగోలు మండీలను కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర మంగళవారం ప్రారంభించారు. కుంద్రా, డొంగరపంశి గ్రామాల్లో కొనుగోలు మండీలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే మండీల వద్ద కనీస సౌకర్యాలు లేక పోవడంతోపాటు ధాన్యం నాణ్యతను పరిశీలించే యంత్రం పనితీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు రాధాబినోద్ సామంతరాయ్, బీడీవో కపిలేశ్వర తండి, కుంధ్ర సమి తి అధ్యక్షులు రాజేశ్వరి పొరజ, బినాయక ఆ చార్య, బిప్రనారాయణ ఆచార్య, సివిల్ సప్‌లై ఇన్‌స్పెక్టర్ మురళీధర హెస పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక రోగులకు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. బరంపురం ఎంకేసీజీ కళాశాలకు చెందిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ స్వాతి మిశ్రో, రాయగడకు చెందిన మానసిక సామాజిక సేవా కర్త పూర్ణ చంద్ర కదంబాల్ తదితరులు ఈ శిబిరంలో 47 మందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. వారికి అవసరమైన మందులను వైద్యులు పంపిణీ చేశారు. శిబిరానికి సమితిలోని 14 పంచాయతీలకు చెందిన ప్రజలు హాజరయ్యారు.
విజిలెన్స్ వలలో విద్యా శాఖ ఉద్యోగి
కొరాపుట్: విజిలెన్స్ వలలో విద్యా శాఖ ఉద్యోగి చిక్కారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా పపడా హండి సమితి కేంద్రంలో సమితి విద్యా శాఖ అభివృద్ధి అధికారి (బీఈఓ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా పని చేస్తున్న రంజిత్ కుమార్ షడంగిని అధికారులు పట్టుకున్నారు. 2011లో పదవీ విరమణ పొందిన రామ చంద్ర సాహు అనే ప్రధానోపాధ్యాయుడిని పెన్షన్ పత్రాలు అనుమతి కోసం రు.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. విసిగిన ఆ ప్రధానోపాద్యాయుడు విజిలెన్స్ వారిని సంప్రదించగా వారిచ్చిన నగదుని రంజిత్‌కి హెచ్‌ఎం అందజేశారు. వెంటనే విజిలెన్స్ అధికారులు మెరుపు దాడి చేసి రంజిత్‌ని పట్టుకుని అరెస్టు చేశారు. రంజిత్ నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు.
గంజాయిపై ఉక్కుపాదం
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి గుంజుగుడ అటవీ ప్రాంతంలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేశారు. డ్రోన్ల సాయంతో గంజాయి సాగు ప్రాంతాలను గుర్తిస్తూ దాడులు చేపడుతున్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
టీ కొట్టులోకి ట్రాక్టర్
భువనేశ్వర్: కటక్ నగరం షెల్టరు ఛక్ ప్రాంతం టీ కొట్టులోకి ఓ ట్రాక్టరు దూసుకు పోయింది. అదృష్టవశాత్తు టీ కొట్టు యజమాని ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రాక్టరు హెల్పర్ నడపడంతో అదుపు తప్పి టీ కొట్టులోకి దూసుకు పోయినట్లు గుర్తించారు.
కుంధ్రలో ధాన్యం మండీలను
ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రూపు భొత్ర
Comments
Please login to add a commentAdd a comment