63 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
రాయగడ: రైతుల నుంచి ధాన్యం క్రయవిక్రయాలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ ఫరూల్ పట్వారి ఈ మేరకు నియంత్రణ బజారు కమిటీ ప్రాంగణంలో మంగళవారం ధాన్యం మండీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆమె మండీలను ప్రారంభించారు. జిల్లాలోని ధాన్యం రైతులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ధాన్యం చివరి గింజ వరకు ప్రతి రైతు నుంచి ఖరీదు చేసేందుకు జిల్లాలో 43 మండీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండీల్లో విక్రయించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్‌కు రూ.2300తో పాటు ఇన్‌పుట్ సాయం కింద మరో రూ.800 చెల్లిస్తుందన్నారు. ఈ ఏడాది 63 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసేందుకు యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment