![నేటి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17ors82b-280031_mr-1734463314-0.jpg.webp?itok=Pejg7MKa)
నేటి నుంచి గజపతి ఉత్సవాలు
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు గజపతి ఉత్సవాలు, పల్లెశ్రీ మేళా ప్రారంభమవ్వనున్నాయి. ఉత్సవాల తొలిరోజు రాష్ట్ర వాణిజ్య, రవాణా, ఖనిజ శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెన్నా ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. జిల్లాలో మోహనా నియోజకవర్గం ఎమ్మెల్యే దాశరథి గొమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ తిరుపతిరావు తదితరులు గౌరవ అతిథులుగా పాల్గోనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అనేక ప్రభుత్వ శాఖల స్టాల్స్‌తో పాటు, పల్లెశ్రీ మేళాలో వివిధ జిల్లాల నుంచి స్వయం సహాయక గ్రూపులు, మిషన్ శక్తి, చేతివృత్తుల కళాకృతుల వస్తువులు ప్రదర్శనలో ఉంచుతారు. ఛత్తీస్‌ఘడ్, అస్సాం, పశ్చిమబెంగాల్ నుంచి తమ కళా ప్రదర్శన ఇవ్వనున్నారు.
![నేటి నుంచి గజపతి ఉత్సవాలు1](https://www.sakshi.com/gallery_images/2024/12/18/17ors82c-280031_mr-1734463314-1.jpg)
నేటి నుంచి గజపతి ఉత్సవాలు
![నేటి నుంచి గజపతి ఉత్సవాలు2](https://www.sakshi.com/gallery_images/2024/12/18/17ors82a-280031_mr-1734463314-2.jpg)
నేటి నుంచి గజపతి ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment