ఎయిమ్స్‌లో రోగి అనుమానాస్పద మృతి
భువనేశ్వర్: చికిత్స కోసం స్థానిక ఎయిమ్స్‌లో చేరిన రోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పడకపై ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ ఉండటాన్ని సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. పంచనామా పూర్తయితే మరణం పూర్వాపరాలు స్పష్టం అవుతాయని ఎయిమ్స్ అధికార వర్గాల సమాచారం. పోలీసులు మృత దేహం స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు జాజ్‌పూర్ జిల్లా అటలాపూర్ గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ సాహు (70)గా గుర్తించారు. చికిత్స కోసం ఎయిమ్స్ ఆర్థోపెడిక్ వార్డులో చేరిన ఆయన మృతి చెందడం చర్చనీయాంశమైంది. దీనిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. సోమవారం రాత్రి డ్యూటీలో పది మంది సిబ్బందితోపాటు వార్డులో 30 మంది రోగులు ఉన్నారు. మరో వైపు మృతిని కుమార్తె తోడుగా ఉండగా ఈ అఘాయిత్యం ఎలా సాధ్యమైందనే కోణంలో పొలీసుల విచారణ చేస్తున్నారు.
ఆస్పత్రికి తాళం
భువనేశ్వర్: ఆస్పత్రిలో చికిత్స చేయాల్సిన వైద్యుడు నిత్యం మద్యం మత్తులో తూగుతూ ఉండడంతో పూరీ జిల్లా కొణాసొ హరచండి ప్రసాద్ ఆరోగ్య కేంద్రానికి అక్కడి వారు తాళం వేశారు. తరచూ విధులకు కూడ డుమ్మా కొడుతున్నట్లు ఆరోపించారు. తక్షణమే ఈ డాక్టర్‌ను ఇక్కడ నుంచి తొలగించాలనే నినాదంతో గ్రామస్తులు ఆస్పత్రికి తాళం వేసి నిరసన ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment