మాంగనీస్ లోడ్‌తో ట్రాక్టర్ స్వాధీనం
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి అటవీ రేంజ్ పరిధి లెల్లిగుమ్మ సంరక్షిత అడవుల నుంచి విలువైన మాంగనీస్ రాళ్లను ట్రాక్టర్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాయగడ కస్తూరనగర్‌కు చెందిన ఎ.రవణ, ఎ.శివ, ఛబీంద్ర మాఝిలు ఉన్నట్లు అటవీ శాఖ రేంజర్ అనిల్ కుమార్ పాణిగ్రహి తెలిపారు. విలువైన మైనింగ్ రాళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సొమవారం తెల్లవారు జామున నిర్వహించిన ఈ దాడుల్లో ట్రాక్టర్‌తో పాటు స్విఫ్ట్ కార్‌ను కూడా స్వాధీనం చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న మైనింగ్ రాళ్ల విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. మాంగనీస్ రాళ్లను ఆంధ్రాకు తరలిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు.
ముగ్గురి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment