పత్రికలు సమాచార వారధులు
జయపురం: పత్రికలు, ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా ఉన్నప్పుడే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి అన్నారు. ‘సొకాలొ’ ఒడియా దినపత్రిక తన నాలుగేళ్ల వార్షిక దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించి మినీ మారథాన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ పార్కింగ్ కేంద్రం నుంచి ప్రధాన మార్గం మీదుగా రథొపొడియ వరకు సాగిన మినీ మారథాన్‌లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో దిలీప్ ఖొర ప్రథమ, గోపీ ఖెముండు ద్వితీయ, ధనస తుమురి తృతీయ స్థానాలలో నిలిచారు. బాలికల గూపులో గౌరీ కిరిసాని, దయామణి హరిజన్, సంజనా మఝి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగనే జూనియర్ గ్రూపులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్న చెల్లెల్లు జమున బహుదూర(13), హరిష్ బహుదూర్(10) తపస్య బహుదూర్(8) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సీనియర్ సిటిజన్‌లో ఎ.మురళి గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment