విజయనగరం: కబడ్డీ, ఖోఖో క్రీడల పితామహుడు దివంగత వై.భగవాన్‌దాస్ మాస్టారు జయంతిని పురష్కరించుకుని ఈ నెల 24న జిల్లా స్థాయి ఉన్నత పాఠశాలల బాలుర కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు భగవాన్‌దాస్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కస్పా కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న బాలుర క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు 94906 63367, 94947 77753 ఫోన్ నండర్లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment