జగన్ అంటే ఓ ప్రభంజనం
రాజాం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఓ ప్రభంజనమని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాజాంలో పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను పాటించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత చవి చూస్తుందన్నారు. ఒక్క హామీని కూడా అమలు చేయలేక చేతులెత్తిసిందన్నారు. ప్రజా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు ప్రజలకు పండగ రోజులా ఉందని, అందుకే అందరూ వాడవాడలా ఆయన జన్మదిన వేడుకలను పండగలా జరుపుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ రాజాం ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ కూటమి అరాచకాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, రాజాం, రేగిడి, వంగర మండలాల పార్టీ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, కరణం సుదర్శనరావు, వావిలపల్లి జగన్మోహనరాఉవ, వంగర ఎంపీపీ ఉత్తరావెల్లి సురష్‌ముఖర్జీ, రాజాం జెడ్పీటీసీ బండి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment