అండగా మాజీ సీఎం జగన్
బాధిత కుటుంబాలకు
● నాగళ్లవలసలో రెండు
కుటుంబాలకు పరిహారం
● రూ.2 లక్షల చొప్పున చెక్‌లు
అందజేసిన జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
డలంలోని నాగళ్లవలసలో డయేరియా కారణంగా మృతి చెందిన రెండు కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పంపిన రూ.2 లక్షల చెక్కులను శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్ల మండలంలో డయేరియా విజృంభించడంతో 13 మంది మృతి చెందడంతో కుటుంబాలు అనాధలుగా మిగిలాయన్నారు. అదే సమయంలో ఆ కుటుంబాలను ఓదార్చేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందజేస్తామని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారం ఇప్పటికే 11 కుటుంబాలకు పరిహారం చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. తాజాగా నాగళ్లవలసకు చెందిన బూరి శాంతి, బూరి నీలమ్మలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన చెక్కులను అందజేసినట్లు చెప్పారు. గుర్ల డయేరియా బాధిత కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేసారు. కానీ ప్రభుత్వం కనీసం బాధిత కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గుర్ల మండల నాయకులు కెవి.సూర్యనారాయణరాజు, పొట్నూరు సన్యాశినాయుడు, శీర అప్పలనాయుడు, స్వామినాయుడు, తోట తిరుపతి, బెల్లాన బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి: డయేరియా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని, మాట ఇవ్వడమే కాకుండా అమలు చేసి చూపించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గుర్ల మం
Comments
Please login to add a commentAdd a comment