శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కింజరాపు శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన మూడేళ్ల పాటు సేవలందించనున్నారు. శ్రీనివాసరావు నియామకం పట్ల బార్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం హర్షం వ్యక్తం చేశారు.
అమిత్‌షా వ్యాఖ్యలపై నిరసన
ఎచ్చెర్ల క్యాంపస్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. దేశానికి క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పి.రవికుమార్, ఎం.చిన్నసుబ్బారావు, వై.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment