శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, రాష్ట్రవ్యాప్తంగా రూ.3580 కోట్లు బకాయిలు వెంట నే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.రవికుమార్ డిమాండ్ చేశారు. శనివా రం శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలిలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా విద్యా దీవెన, వసతి దీవెనలు(ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్) చెల్లించడంలో అలస త్వం వహిస్తోందన్నారు. కళాశాలల యాజమాన్యా లు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నార ని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకా రం యాజమాన్యాల వద్ద ఏడు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పారు. ఉన్నత విద్య కు సంబంధించి జీవో 77పై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పూర్ణ, రాజు, ప్రవీణ్, రమేష్‌కుమార్, శ్రీను, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment