మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
● ఉపముఖ్యమంత్రి ప్రభాతి పోరిడా
మల్కన్‌గిరి: జిల్లాలో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి ప్రభతి పోరిడా పర్యటించారు. తొలిరోజు బోండఘటీ, చిత్రకొండలో పర్యటించారు. రెండో రోజు శనివారం స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా అబివృద్ధిపై జిల్లా అఽధికారులతో సత్తిగూడ, చిత్రకొండ, సప్తధర, మల్లికేశ్వర్, గురుప్రీయ, గుమ్మఝోరణ, హంతాళ్‌గూడ తదితర పర్యటక ప్రదేశాల్లో మౌలిక వసుతులు సాదుపాయాలు కాల్పిస్తామన్నారు. ఇద్దరు విద్యావంతులను సుభద్ర యోజనలో మహిళలకు సహకారంగా నియమించాలని అధికారులకు ఆదేశించారు. అంగాన్‌వాడీ కేంద్రాల్లోని మౌలిక వసతులపై ఆరా తీశారు. బాల్య వివాహాలను అరికాట్టాలని జిల్లా చైల్డ్ డెవలప్‌మెంట్ ఆర్గినైజేషన్ ప్రతినిధులు, బాలాల సంరక్షణ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, అదనపు కలెక్టర్ సోమనాధ్ ప్రదాన్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రదాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు
అతి తక్కువ పగటి సమయం
భువనేశ్వర్: నగరంలో శనివారం అతి తక్కువ పగటి సమయం నమోదైంది. ఉదయం 6 గంటలకు సూర్యోదయం, సాయంత్రం 5 గంటలకు సూర్యాస్తమయం జరిగింది. 10 గంటల 55 నిమిషాల నిడివితో పగటి పూట పరిమితమైంది.
కాలువలోకి జారిన బస్సు
భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లాలో ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు కాలువలోకి జారింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. కటక్ నుంచి జంబు వెళ్తుండగా కేంద్రాపడా జిల్లా పొట్టాముండై బొడొపొడా ప్రాంతంలో కాలువలోకి జారింది. గ్రామస్తులు, స్థానిక ఠాణా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
సమగ్రశిక్ష ఏపీసీగా శశిభూషణ్
శ్రీకాకుళం న్యూకాలనీ: సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అదనపు ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ (ఏపీసీ)గా జిల్లాకు చెందిన డాక్టర్ సంపతిరావు శిశిభూషణ్‌ను నియమిస్తూ పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆయన్ను ఫారిన్ సర్వీస్‌పై ఏపీసీగా నియమిస్తు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈయన డిగ్రీ విద్యార్థులకు ఆరు సెమిస్టర్ పుస్తకాలను(ఇంగ్లిష్) తయారుచేసి, ఉత్తరాంధ్రాలో లక్షకుపైగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శశిభూషణ్ మాట్లాడుతూ ప్రభుత్వ విధివిధానాలకు లోబడి కేజీబీవీల బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.
29న తూర్పుకాపుల ఆత్మీయ కలయిక
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగిన తూర్పుకాపు సామాజికవర్గం శ్రీకాకుళం జిల్లా మహా సమ్మేళనం ఈ నెల 29న ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్ పక్కన స్థలంలో నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు నగరంలో ని ఓ ప్రయివేటు కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్, కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ కలయికకు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గమంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు సురంగి మోహనరావు, డోల జగన్‌మోహన్, శాసపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావు, లంక శ్యామసుందర్, కిళ్లారి నారాయణరావు, డాక్టర్ ఎం.రామజోగినాయుడు, వాళ్ళ శ్రీరాములునాయుడు, పల్లి సురేష్, డోల బాలు, డాక్టర్ చందక రామకృష్ణ, మిర్తివాడ ప్రభాకర్, నేతల అప్పారావు, ఎం.శంకర్ నారాయణ, బొంతు విజయకృష్ణ, లోలుగు రవి పాల్గొన్నారు.
2.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జి.సిగడాం: జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి త్రినాథస్వామి తెలిపారు. శనివారం జి.సిగడాం మండలం ఆబోతులపేట, ఆనందపురం గ్రామాల్లో తడిచిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3 లక్షల 60 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా..3లక్షల 45 వేల మంది ఈకేవైసీ చేశామన్నారు. వీరి వద్ద నుంచి మాత్రమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఓలు యర్రా శారద, బాబ్జి, సర్పంచ్ చిత్తిరి మోహన్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ముంతా హేమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment