అకాల వర్షాలతో నష్టం
పర్లాకిమిడి: అకాల వర్షాలతో గజపతి జిల్లాలో అనేక వేల ఎకరాల్లో వరి దెబ్బతింది. సంక్రాంతి పండగకి ధాన్యం అమ్మకాలు జరిపి బంధువులతో సంతోషం పంచుకుందామని అనుకుంటే రైతుల ఆశలను అకాల వర్షాలు నీరుగార్చాయి. గుసాని సమితి మధుసూదన్‌పూర్ పంచాయతీ సింగిపురం గ్రామంలో 40 ఎకరాల్లో ధాన్యం నీటిపాలైంది. రంగుమారిన ధాన్యం మిల్లర్లు, మండీలలో అధికారులు కోనుగోలు చేస్తారో లేదో అని సింగిపురం రైతు ధనుంజయ్ విచారం వ్యక్తం చేశారు. గుసాని సమితి కోర్సండ, జాజిపురం, కత్తల కవిటి, ఆర్.సీతాపురంలో ఎగరపోత జరిగిన ధాన్యంను ట్రాక్టర్లులో ఉంచి పరదాలు కప్పుతున్నారు. ఈ శుక్రవారం పర్లాకిమిడిలో 12.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శనివారం గజపతి జిల్లాలో పర్లాకిమిడి, గుసాని బ్లాక్‌లో 53.0, 51.0 మిల్లీమీటర్ల వాన కురిసింది. కాశీనగర్‌లో 52.0., రాయగడలో 35.0, నువాగడలో 38.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment