రైతన్న దిగాలు
భువనేశ్వర్: వాతావరణ మార్పుతో రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ అకాల వానలు రైతు కష్టాన్ని నీటిపాలు చేశాయి. దీని ప్రభావంతో వరి మొలకలు తొడిగే ప్రమాదం పొంచి ఉంది. పొలాల్లో పంట నీట తడిసిన మండీలకు చేరిన వరికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని రాష్ట్ర సహకార శాఖ మంత్రి ప్రదీప్ బొలొ సామంత అభయం ఇచ్చారు. అకాల వర్షాలతో పంట నాణ్యత దిగజారినట్లు ఖరారైతే సముచిత పరిహారం రైతులకు చెల్లిస్తామన్నారు.
తక్షణ చర్యలకు ఆదేశాలు
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రముఖ కార్యదర్శి డాక్టరు అరవింద కుమార్ పాఢి అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రభావిత ప్రాంతాల నుంచి కలెక్టర్లు వర్చువల్‌గా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. పంటలపై అకాల వర్షం ప్రభావం తక్షణమే విశ్లేషించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి కలెక్టర్లకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి పంట నష్టం నివేదిక దాఖలు చేయాలని తెలిపారు. ప్రత్యేక సహాయ కమిషనరు, పంట బీమా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభావిత రైతులకు తక్షణమే పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నీట మునిగిన పంట సంరక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలి. ఈ మేరకు రైతులకు చైతన్యపరచాలని కలెక్టర్లకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment