అమర సైనికుడికి ఘన నివాళి
జయపురం: రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్ రేంజ్‌లో ఫైరింగ్ అభ్యసిస్తున్న సమయంలో బుధవారం అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో సైనికుడు ఈశ్వర్ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. 46వ ఆర్మ్‌డ్ రెజిమెంట్ కమాండ్ ఆఫీసర్ ఈశ్వర్ పార్థివ దేహానికి గార్డ్‌ఆఫ్ హానర్ ఇచ్చిన తరువాత శనివారం ఉదయం 8 గంటల సమయంలో విమానంలో విశాఖపట్నం తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో అతడి స్వగ్రామం బొయిపరిగుడ సమితి బొడగుడ గ్రామానికి పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. దారంతా ఈశ్వర్‌కు నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు. బొయిపరిగుడలో వందలాది మంది యువత మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment