ముగిసిన అంతర్జాతీయ సెమినార్
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీలో గత మూడు రోజులుగా జరుగుతున్న రెండో అంతర్జాతీయ స్కోప్స్ ( సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, పవర్, ఎంబెడెడ్ సిస్టం) ముగింపు సమావేశం శనివారం ఓపెన్ ఆడిటోరియంలో జరిగింది. ఈ ముగింపు సమావేశానికి డీఆర్‌డీఏ మాజీ డైరక్టర్ డాక్టర్ పి.ఎస్.ఆర్.శ్రీనివాస శాస్త్రి, డిసాల్ట్ సిస్టం, ఇండస్ట్రీ ప్రాసెస్ కన్సల్టెంట్ డాక్టర్ రఫేల్ స్కుడేరీ, డాక్టర్ నయీం హన్నన్ (మలేషియా), డాక్టర్ రేణుకా శ్రీనివాసన్ (డిసాల్ట్ సిస్టం), ఐఐటీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ గణపతి పండా, మైక్రోసాఫ్ట్ ప్రిన్సిపల్ మ్యానేజర్ సునీల్ సాబత్, డాక్టర్ జగన్నాథ నాయక్ (డి.ఆర్.డి.ఓ), మార్క్యూసెమీ కండక్టర్ సీ.ఈ.ఓ పూర్ణచంద్ర మహాంతి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 632 పరిశోధన పేపర్స్ ఆమోదించగా, వాటిలో 229 ఆన్‌లైన్‌లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇలాంటి అంతర్జాతీయ సమావేశం ఏర్పాటుచేసిన సెంచూరియన్ వర్సిటీ అధ్యక్షుడు డి.ముక్తికాంత మిశ్రా, ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, డాక్టర్ దేవేంద్ర కుమార్ సాహు, ఉపకులపతి డాక్టర్ బిశ్వజిత్ మిశ్రాను ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ దేవేంద్ర కుమార్ సాహు అభినందించారు. అనంతరం ముఖ్యమైన అతిథులకు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్ (ఇంజినీరింగ్ స్కూల్) డాక్టర్ ప్రపుల్ల కుమార్ పండా, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాడి, ప్రొఫెసర్ అశోక్ మిశ్రా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment