జీఐఈటీలో సృజన్ 3.0
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జిఐఈటీ) విశ్వవిద్యాలయంలో శనివారం నుంచి సృజన్ 3.0 పేరిట వార్షిక సాంసృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ చంద్ర ధ్వజ పండ మాట్లాడుతూ విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం కన్వీనర్ డాక్టర్ బిదు ప్రసాద్ స్వాగతోపన్యాసం చేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఏవీ జగన్నాథరావు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుండడంతో వారికి ఉపాధి దొరుకుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment