నగర డీసీపీ పినాక్ మిశ్రాకు పదోన్నతి
భువనేశ్వర్: నగర డీసీపీ పినాక్ మిశ్రాకు పదోన్నతి లభించింది. రాష్ట్రంలోని 8 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించిన వారిలో ఆయన ఒకరు. తాజా పదోన్నతి ఉత్తర్వుల ప్రకారం 2000 సంవత్సరపు బ్యాచ్ ఐపీఎస్ అధికారులు యతేంద్ర కోయల్, కేంద్ర డిప్యుటేషన్‌లో ఉన్న ప్రతీక్ మహంతి అదనపు డైరెక్టరు జనరల్ స్థాయికి పదోన్నతి పొందారు. ప్రస్తుతం ప్రతీక్ మహంతి సీఐఎస్‌ఎఫ్ (హెడ్‌క్వార్టర్స్)లో ఐజీగా పని చేస్తున్నారు. 2007 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు అవినాష్ కుమార్, సార్థక్ షడంగి, నీతి శేఖర్‌లు ఇనస్పెక్టరు జనరలుగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం భువనేశ్వర్ డీసీపీగా ఉన్న 2011 సంవత్సరపు బ్యాచ్ ఐపీఎస్ అధికారి పినాక్ మిశ్రా డీఐజీగా పదోన్నతి పొందారు. ఈ బ్యాచ్‌కు చెందిన మరో 2 మంది ఐపీఎస్ అధికారులు బి.యుగళ కిషోర్ కుమార్, బి.గంగాధర్ డీఐజీగా పదోన్నతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment