కిటకిటలాడిన పోలమాంబ ఆలయం
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకునేందుకు రావడంతో చదురుగుడి భక్తులతో కిటకిటలాడింది. వచ్చే సోమవారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభంకావడంతో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున సుదూర ప్రాంతాలనుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అంతేకాకుండా ఆదివారం సెలవుదినం కావడం, సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనుండడంతో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. చీరలు, ఘటాలు, కోళ్లు మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణ చర్యలు చేపట్టారు.
అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు
చదురుగుడిలోని అమ్మవారి ఘటాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఘటాలకు చీరలు చూపించి, తలపై అమ్మవారి ఘటాలను ఎత్తుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల తరువాత అమ్మవారి ఘటాలను గ్రామంలోని అన్ని పురవీధుల్లో ఊరేగించారు.
సుదూర ప్రాంతాలనుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు
అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు
మొక్కులు తీర్చుకున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment