అంగన్వాడీ సహాయకుల నియామకానికి నోటిఫికేషన్
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీఎస్ పీడీ డా.టి. కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పాలకొండ డివిజన్‌లో సీతంపేట ప్రాజెక్టు పరిధిలో రెండు, భామిని ప్రాజెక్టు పరిధిలో ఒక పోస్టు, కురుపాం ప్రాజెక్టు పరిధిలో ఆరు, పార్వతీపురం డివిజన్‌లో పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో ఒకటి, సాలూరు ప్రాజెక్టు పరిధిలో ఒకటి అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. 11 అంగన్వాడీ సహాయకుల పోస్టుల ఖాళీలను షెడ్యూల్ ట్రైబల్ హ్యాబిటేషన్ గ్రామాలను అనుసరించి షెడ్యూల్ ట్రైబల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు ఒక యూనిట్‌గా
ఐసీడీఎస్ ప్రాజెక్టు ఒక యూనిట్‌గా పరిగణించి కేటగిరిని నిర్ధారించి పోస్టులను ప్రకటించామన్నారు. స్థానికంగా స్థిరనివాసం కలిగిన అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. దరఖాస్తులను జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఇంటర్వూ తేదీ, స్థలం తదుపరి తెలియజేయనున్నట్లు తెలిపారు.
నిబంధనలు తప్పనిసరి
అంగన్వాడీ సహాయకుల నియమకానికి స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళ అయి ఉండాలి. 2024 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్టీ కేంద్రాలకు ఎస్టీ కేటగిరికి రోస్టరులో రిజిస్టర్ అయిన పోస్టులకు 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని పక్షంలో 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ చెప్పారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, 10వ తరగతి పాస్ అయిన వారు లేకపోతే దాని కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారిని పరిగణనలోకి తీసుకోనున్నామన్నారు.
బోనస్ మార్కులు ఇలా..
10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత అయిన అభ్యర్థులకు 50 మార్కులు, ప్రీస్కూల్ టీచర్/కృషి/ప్రీస్కూల్ మేనేజ్‌మెంట్ ఇంటర్‌మీడియట్ బోర్డు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికెట్ కలిగిన వారు లేదా ఈసీఈ వర్కర్‌గా పనిచేస్తున్న వారికి 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, మైనార్టీ తీరని పిల్లలు కలిగిన వితంతువులకు 5 మార్కులు, పూర్తి ఆనాథ, బాలసదన్ ప్రభుత్వ సంస్థలలో నివసించి మంచి నడవడిక, సత్ప్రవర్తన సర్టిఫికెట్ కలిగినవారికి 10 మార్కులు, అర్హత కలిగిన దివ్యాంగులకు 5 మార్కులు, మౌఖిక ఇంటర్వ్యూకు 20 మార్కులు వెరసి వంద మార్కులకు పరిగణించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ వివరించారు.
11 పోస్టుల భర్తీ
ఐసీడీఎస్ పీడీ డా. టి. కనకదుర్గ
Comments
Please login to add a commentAdd a comment