ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒరిగిందేమీ లేదు
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలకు పైగా అయినా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరపు సూర్యనారాయణ విచారం వెలబుచ్చారు. మంత్రివర్గ సమావేశం జరుగుతుందంటే ఏదో మేలు జరుగుతుందని ఆశతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎదురుచూడడం, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారిని నిరాశపరచడం జరుగుతూనే ఉంటుంది. గత ప్రభుత్వంలో రావలసిన బకాయిలు లేవు. ఈ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డీఏలు ఐఆర్‌పీఆర్‌సీకి సంబంధించిన కమిషన్లు కూడా వేయలేదన్నారు. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఏ ప్రభుత్వం వచ్చినా మేలు జరిగేది లేదనే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని సూర్యనారాయణ విమర్శించారు. మూడు సంవత్సరాల నుంచి ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవులు, పీఎఫ్, ఏపీజేఎల్‌ఐలు విడుదల చేయని పక్షంలో నూతన సంవత్సరంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు నిరసన బాట పట్టక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పీఆర్‌టీయూ విమర్శ
Comments
Please login to add a commentAdd a comment