కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన
పర్లాకిమిడి: ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ కల్‌కాజీ విధానసభ ఎమ్మెల్యే రమేష్ బిదురీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పర్లాకిమిడిలోని తెలుగు సోండి వీధి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆదేశాల మేరకు ఢిల్లీ ఎమ్మెల్యే రమేష్ బిదురీ చిత్ర పటాన్ని మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జస్మిన్ షేక్ ఆధ్వర్యంలో దహనం చేసి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బసంతపండా, మాజీ కౌన్సిలరు అభిమన్యు పండా, సురేష్ మఝి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment